Thursday, July 9, 2009

ఓ ప్రియ సఖీ.....!!!!!!????
నా హృదయంతో దోబూచులాడిన
నా ప్రియ సఖీ.....
నీ రాకకై నా నిరీక్షణ
క్షణమొక యుగంలా ....
ప్రతి నిమిషం ఓ కల్పంలా..
మోడువారిన మానులా జీవిస్తున్నాను...
నువ్వొస్తున్నావని తెల్పిన
మేఘ సందేశం....
నా కందిన మరుక్షణం ...
నా చిన్ని గుండె పులకరించింది.
నా హృదయమనే ద్వారమును తెరిచి...
చూపులనే తోరణాలుగా...
మాటలనే విల్లుగా ఎక్కుపెట్టి….
నీకై ఎదురు చూస్తున్నాను.
నా మదియే మంటపంగా...
నా మనస్సే ఆలయంగా....
ఆ కోవెలలో ప్రేమ పూజారినై....
ప్రేమ పంచాక్షరిణి ని జపించి
జ్ఞానేంద్రియాలనే పూజా విధానంతో...
నిను అర్చించి తరిస్తాను.
నీరాకకై ఒక జన్మ కాదు నెచ్చెలీ...
ఎన్ని జన్మలైనా నీకొరకే ...
ఇలానే....ఇలాగే....
ఎదురుచూస్తా......
చూస్తూనే ఉంటా...........నీ.........
జన్మ జన్మల ప్రేమ పిపాసి!!!!!!?????

తెలుగు కవితలు :తూర్పింటి